సైబర్ దాడి వల్లే నా పాప చనిపోయింది.. అమెరికాలో కోర్టుకెక్కిన తల్లి

  • స్ప్రింగ్‌హిల్ మెడికల్ సెంటర్‌పై భారీ మాల్వేర్ దాడి
  • ఆ సమయంలోనే జన్మించిన నికో సిలార్ అనే పాప
  • సరిగా మానిటర్ చేయలేకపోవడంతో మరణించిందంటున్న తల్లి
 తన పాపకు ఆసుపత్రిపై జరిగిన సైబర్‌దాడే కారణమంటూ ఒక తల్లి కోర్టుకెక్కింది. తనకు ఆసుపత్రి నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. అమెరికాలోని అలబామాలో ఈ ఘటన వెలుగు చూసింది. టైరానీ కిడ్ అనే యువతికి 2019 జులై17న నికో సిలార్ అనే పాప పుట్టింది. ఆమెకు స్ప్రింగ్‌హిల్ మెడికల్‌ సెంటర్‌లో డెలివరీ జరిగింది. అయితే ఆ సమయంలో ఆసుపత్రిపై భారీ మాల్వేర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని టైరానీకి ఆసుపత్రి వర్గాలు చెప్పలేదు.

ఈ క్రమంలో డెలివరీ సమయంలో మెదడుకు కొన్ని గాయాలవడంతో నికో మరోసారి ఆసుపత్రి పాలైంది. స్ప్రింగ్‌హిల్ ఆసుపత్రిలో ఏం జరిగిందో తెలిసిన టైరానీ వేరే ఆసుపత్రిలో తన పాపను చేర్పించింది. అక్కడ కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత 9 నెలల నికో కన్నుమూసింది.

ఇదే విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్న టైరానీ.. తనకు సైబర్ దాడి గురించి ముందే తెలిసుంటే వేరే ఆసుపత్రిలో చేరేదాన్నని అంటోంది. అలాగైనా తన పాప బతికేది కదా అంటూ కన్నీరు పెడుతోంది. తన పాప మరణానికి ఆసుపత్రి వర్గాలే బాధ్యత వహించాలని అంటోంది.


More Telugu News