పవన్, మహేశ్ సినిమాల రిలీజ్ పై 'ఆర్ ఆర్ ఆర్' ఎఫెక్ట్!
- రిలీజ్ డేట్ చెప్పేసిన 'ఆర్ ఆర్ ఆర్'
- జనవరి 7వ తేదీన భారీ విడుదల
- సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్
- త్వరలో రానున్న స్పష్టత
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను, ఈ దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొంతసేపటి క్రితం ప్రకటించారు.
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ సినిమా 'భీమ్లా నాయక్'ను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఇక జనవరి 13వ తేదీన తమ సినిమా రానున్నట్టుగా 'సర్కారువారి పాట' సినిమా వారు ప్రకటించారు. ఆ తరువాత రోజునే ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫిక్స్ చేసుకుంది.
కానీ ఇప్పుడు హఠాత్తుగా జనవరి 7వ తేదీ నుంచి 'ఆర్ ఆర్ ఆర్' రంగంలోకి దిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' రిలీజ్ మార్చి నెలకి, 'సర్కారువారి పాట' ఏప్రిల్ కి షిఫ్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'రాధే శ్యామ్' ప్రస్తావన అయితే లేదు. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నాయనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి. .
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ సినిమా 'భీమ్లా నాయక్'ను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఇక జనవరి 13వ తేదీన తమ సినిమా రానున్నట్టుగా 'సర్కారువారి పాట' సినిమా వారు ప్రకటించారు. ఆ తరువాత రోజునే ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫిక్స్ చేసుకుంది.
కానీ ఇప్పుడు హఠాత్తుగా జనవరి 7వ తేదీ నుంచి 'ఆర్ ఆర్ ఆర్' రంగంలోకి దిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' రిలీజ్ మార్చి నెలకి, 'సర్కారువారి పాట' ఏప్రిల్ కి షిఫ్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'రాధే శ్యామ్' ప్రస్తావన అయితే లేదు. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నాయనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి.