కొందరు ద్రోహులు, దుర్మార్గులు తాత్కాలికంగా గెలవొచ్చు... కానీ చివరికి ఓడిపోయేది వారే: సమంత
- విడిపోతున్నట్టు ప్రకటించిన నాగచైతన్య, సమంత
- సమంత భావోద్వేగభరితమైన పోస్టు
- గర్భంతో ఉన్న యువతి ఫొటో పంచుకున్న సామ్
- చివరికి ప్రేమే గెలుస్తుందని వ్యాఖ్యలు
నాగచైతన్యతో వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించిన సమంత ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. "నేను నిరాశా, నిస్పృహలో ఉన్నప్పుడు ఎక్కువగా ఓ విషయాన్ని స్మరించుకుంటూ ఉంటాను. చివరికి గెలిచేది సత్యం, ప్రేమ అని చరిత్ర ఆసాంతం నిరూపితమైంది. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకులు ఉంటారు... వారు వెన్నుపోటు పొడుస్తారు, కుట్రలు చేస్తారు. కొన్నిసార్లు వాళ్లే గెలవొచ్చు... కానీ చివరికి వాళ్లే పతనమవుతారు. దీన్ని నేనెప్పుడూ నమ్ముతుంటాను" అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేశారు.
ఈ పోస్టుకు సమంత ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ పిక్ చర్చనీయాంశంగా మారింది. గర్భంతో ఉన్న ఓ యువతి ఫొటోపై సమంత తన మ్యాటర్ ను పొందుపరిచారు. "మా అమ్మ చెప్పింది" అనే శీర్షికన ఆమె ఈ పోస్టు చేశారు.
ఈ పోస్టుకు సమంత ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ పిక్ చర్చనీయాంశంగా మారింది. గర్భంతో ఉన్న ఓ యువతి ఫొటోపై సమంత తన మ్యాటర్ ను పొందుపరిచారు. "మా అమ్మ చెప్పింది" అనే శీర్షికన ఆమె ఈ పోస్టు చేశారు.