వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్దలే!: బండి సంజయ్
- ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర తొలిదశ
- హుస్నాబాద్ లో భారీ ర్యాలీ
- హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
- ఇదే చివరి పోరాటమన్న బండి సంజయ్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ పాదయాత్రకు హాజరవుతున్న జనాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ జోష్ చూస్తుంటే 2023లో అధికారం బీజేపీదే అని అర్థమవుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్దలేనని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరైనా గానీ మొదటి సంతకం మాత్రం విద్య, వైద్యం పైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే చివరి పోరాటంగా పాదయాత్ర చేస్తున్నామని ఉద్ఘాటించారు.
బండి సంజయ్ పాదయాత్ర తొలి దశ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా హాజరయ్యారు.