జగన్ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు... పవన్ మర్చిపోయారేమో: మంత్రి కన్నబాబు

  • పవన్ శ్రమదానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
  • 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు చేసిన శ్రమదానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 2,200 కోట్లు కేటాయించిందని... వర్షాలు తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. పార్టీ పెట్టిన 12 ఏళ్లలో పవన్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారనే విషయం అర్థమయిందని చెప్పారు.
 
జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో పవన్ చెప్పారని... ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. వైసీపీపై ఏ యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివాళ్లే యుద్ధం గురించి మాట్లాడతారని అన్నారు. జగన్ కు ఒక కులాన్ని ఆపాదించి లబ్ధిపొందాలని చూస్తున్నారని చెప్పారు. హైదరాబాదులో ఉంటున్న పవన్ కు ఏపీ పరిస్థితులు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు.


More Telugu News