రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాంటూ సంచలన ప్రకటన చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో
- 2022లో ఫిలిప్పీన్స్ లో ఎన్నికలు
- అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని ప్రకటించిన రోడ్రిగో
- కుమార్తెకు లైన్ క్లియర్ చేస్తున్నారంటూ అనుమానాలు
ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టో సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. 2022 ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనని చెప్పారు.
ఫిలిప్పీన్స్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న వారు మళ్లీ దేశాధ్యక్ష పదవికి పోటీచేయడానికి అనర్హులు. రోడ్రిగో విధేయుడు, సెనేటర్ క్రస్టఫర్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయనున్నారు. మరోవైపు రోడ్రిగో తన కుమార్తె సారాకు లైన్ క్లియర్ చేసేందుకే రేసు నుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లావినా అన్నారు. ఆయన ఆలోచన మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.