భూమి మసకబారిపోతోందట.. శాస్త్రవేత్తల ఆందోళన
- న్యూజెర్సీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి
- గత మూడేళ్లుగా విపరీతమైన మార్పులు
- 20 ఏళ్లలో దాదాపు 0.5 శాతం కాంతి తగ్గుదల
- భూమిపై పరిస్థితులు, సముద్రాలు వేడెక్కడమే కారణం
కాలుష్య భూతం ప్రపంచాన్ని ఎంతగా కలవరపెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. తాజాగా, మానవాళిని భయపెట్టే మరో విషయం ఒకటి అధ్యయనంలో వెల్లడైంది.
గత రెండు దశాబ్దాలతో పోలిస్తే భూమి రోజురోజుకు మసకబారిపోతోందని తేలింది. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక చదరపు మీటరుకు సగం వాట్ తక్కువ కాంతిని భూమి ప్రతిబింబిస్తోందని, దీనిని బట్టి ఈ 20 ఏళ్లలో దాదాపు 0.5 శాతం కాంతి తగ్గిపోయిందని అధ్యయనం స్పష్టం చేసింది.
గత రెండు దశాబ్దాలలో 17 ఏళ్లపాటు భూమి వెలుగులో ఎలాంటి మార్పు లేదని, గత మూడేళ్లలోనే భూమి కాంతిలో మార్పులు సంభవిస్తున్నట్టు కనుగొన్నారు. గత మూడేళ్ల డేటాను పరిశీలించినప్పుడు ఈ ఆందోళనకర విషయాలు బయటపడ్డాయని శాస్త్రవేత్త ఫిలిప్ తెలిపారు.
భూమిపై వెలుగును సూర్యకాంతి ప్రభావితం చేస్తుండడంలో ఎలాంటి మార్పులు లేవని, కానీ మసకబారిపోతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని, ఇందుకు భూమిపై పరిస్థితులు, సముద్రాలు వేడెక్కడమే కారణమని శాస్త్రవేత్తలు వివరించారు.