రాణించిన వెంకటేశ్ అయ్యర్.. పంజాబ్ టార్గెట్ 166 పరుగులు
- 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ అయ్యర్
- అతనికి జతకలిసిన రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా
- మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఒక మోస్తరు స్కోరుకే పరిమితమైన కేకేఆర్
పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (67 పరుగులు) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికితోడు రాహుల్ త్రిపాఠి (34), నితీశ్ రాణా (31) కూడా రాణించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసేలా కనిపించింది.
కానీ చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా, వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఒక వికెట్ తీశాడు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లో వెంకటేశ్ అయ్యర్, త్రిపాఠి, నితీశ్ రాణా తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు.