సిక్సర్‌తో జట్టును గెలిపించిన ధోనీ.. కుమార్తె జీవా రియాక్షన్ చూడండి!

  • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ధోనీ 
  • 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా భారీ సిక్స్ 
  • ఇప్పటి వరకూ 11 మ్యాచులు ఆడి 9 విజయాలు నమోదు చేసిన చెన్నై జట్టు
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఫినిషర్ మరొకరు లేరు అంటూ మరోసారి క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు. దీనంతటికీ కారణం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్. చివరి బంతికి భారీ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు ధోని. ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై జట్టుకు మరింత బూస్ట్ ఇచ్చాడు.

షార్జా వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచులు ఆడిన చెన్నైకి ఇది 9వ విజయం. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలవాలంటే చివరి 3 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతిని ధోనీ నేరుగా స్టాండ్స్‌లోకి పంపి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.

ఆ సమయంలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నవారిలో ధోనీ భార్య సాక్షి, ముద్దుల కుమార్తె జీవా కూడా ఉన్నారు. ధోనీ సిక్సర్‌కు వీరిద్దరూ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


More Telugu News