కొత్తచెరువులోనూ అదే తంతు.. పవన్ రాకకు ముందే రోడ్లకు మరమ్మతులు!
- రెండుచోట్ల పవన్ శ్రమదానానికి నిర్ణయం
- ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజిపై రోడ్డుకు మరమ్మతులు
- పోలీసుల అనుమతి నిరాకరణ
- వేదిక హుకుంపేటకు మార్చిన జనసేన
- దీనికీ నో చెప్పిన పోలీసులు!
- రేపటి పవన్ పర్యటనలపై ఉత్కంఠ
పవన్ కల్యాణ్ ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో రెండు చోట్ల శ్రమదానం చేసి రోడ్ల మరమ్మతు పనుల్లో పాల్గొనాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, ధవళేశ్వరం కాటన్ బ్యారేజిపై శ్రమదానానికి పవన్ కు అనుమతి నిరాకరించడంతో, శ్రమదానం వేదికను రాజమండ్రి హుకుంపేటలోని బాలాజీనగర్ కు మార్చారు. పవన్ హుకుంపేట కార్యక్రమం ముగిశాక అనంతపురం జిల్లా కొత్తచెరువులో శ్రమదానం చేయాలని భావించారు.
అయితే, రెండు చోట్లా పవన్ పర్యటనలకు ఇంతవరకు అధికారుల నుంచి అనుమతి రాలేదు. పైగా, ధవళేశ్వరం, హుకుంపేట ప్రాంతాల్లో ఆగమేఘాలపై రోడ్ల మరమ్మతు పనులకు తెరలేపారు. అటు, ధవళేశ్వరం, హుకుంపేట తరహాలోనే కొత్తచెరువులోనూ పవన్ రాకముందే రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు.
కాగా, జనసేన తరఫున శ్రమదానానికి అనుమతి కోరలేదని పోలీసులు అంటున్నారు. దీనిపై జనసైనికులు స్పందిస్తూ, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలిపారు.