రేపు కొత్తచెరువులో శ్రమదానాన్ని నిర్వహించనున్న పవన్ కల్యాణ్

  • అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద శ్రమదానం
  • అనంతరం బహిరంగసభ నిర్వహణ
  • రేపు మధ్యాహ్నం పుట్టపర్తికి చేరుకోనున్న పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ రేపు ఏపీలో శ్రమదానాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో ఆయన శ్రమదానంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన పుట్టపర్తికి చేరుకుంటారు. అనంతరం శ్రమదానంలో పాల్గొని... ఆ తర్వాత కొత్తచెరువు జంక్షన్ వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు.

తొలుత రాజమండ్రి కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కల్యాణ్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అయితే, జలవనరుల శాఖ అధికారులు అందుకు అనుమతిని నిరాకరించారు. దీంతో శ్రమదానం వేదికను ఆయన మార్చారు.


More Telugu News