డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిన రానా

  • బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో కార్యక్రమం 
  • స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసిన వైనం
  • టెక్నాలజీ వినియోగంపై ప్రశంసలు
  • ప్రజల భాగస్వామ్యం అవసరమన్న రానా  
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో ఐటీ, అటవీశాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా పాల్గొన్నారు. మారుత్ డ్రోన్ల ద్వారా విత్తన బంతులను (సీడ్ బాల్స్) వెదజల్లే కార్యక్రమాన్ని రానా ప్రారంభించి, స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాలను ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చేపడుతుంటారని వెల్లడించారు. మన ప్రాంతంలోనూ ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు.

మానవాళి మేలుకోరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం హర్షణీయమని పేర్కొన్నారు. 2023 నాటికి వంద కోట్ల మొక్కలు పెంచాలన్న కార్యాచరణలో ఇది కీలక ఘట్టం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని రానా పిలుపునిచ్చారు.


More Telugu News