టాటా మోటార్స్‌లో ఉపాధ్యక్షుడిగా చేరిన ఫోర్డ్ ఇండియా మాజీ అధ్యక్షుడు

  • పదేళ్లుగా ఫోర్డ్ ఇండియాలో పని చేసిన అనురాగ్ 
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా నియామకం 
  • భారత్‌లో కార్ల తయారీ నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటన  
  • అసంతృప్తితోనే కంపెనీ వీడిన అనురాగ్ మెహ్రోత్రా
ఫోర్డ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహ్రోత్రా కొత్త ఉద్యోగంలో చేరారు. టాటా మోటార్స్‌ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. ఆయన శుక్రవారం నుంచి ఈ కొత్త పదవిలో కొనసాగుతారని టాటా మోటార్స్ సంస్థ ఉద్యోగులకు పంపిన కమ్యూనికేషన్‌లో పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్ కార్ల కంపెనీ భారతీయ విభాగంలో గడిచిన పదేళ్లుగా అనురాగ్ పనిచేస్తున్నారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే భారత్‌లో తమ కార్ల తయారీని నిలిపివేస్తామని ఫోర్డ్ ఇటీవల ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అనురాగ్ ఆ కంపెనీని వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారతీయ మార్కెట్లో కార్లు తయారు చేసి అమ్మడం పెద్ద లాభదాయకంగా లేదని ఫోర్డ్ భావించింది.

అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల మెహ్రోత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫోర్డ్ ఇండియాకు రాజీనామా చేసినట్లు సమాచారం.


More Telugu News