తొలి రోజే నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు

  • కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
  • అనంతరం నేరుగా హుజూరాబాద్ కు
  • టీఆర్ఎస్ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు
నామినేషన్లకు తొలి రోజైన నేడే హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న హుజూరాబాద్ కు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నిన్న గెల్లు బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే.

ఇవాళ ఆయన నామినేషన్ పత్రాలను తీసుకుని కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం నేరుగా హుజూరాబాద్ కు చేరుకుని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ ను సమర్పించారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట వెళ్లారు.


More Telugu News