స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తోంది: భార‌త్

  • చైనా చ‌ర్య‌ల‌పై విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి ప్ర‌క‌ట‌న‌
  • భార‌త సైన్యం కూడా కౌంట‌ర్ చ‌ర్య‌లు చేప‌ట్టింది
  • సరిహ‌ద్దు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇప్ప‌టికైనా చైనా ముందుకు రావాలి
శాంతి మంత్రం జ‌పిస్తూనే తూర్పు ల‌డఖ్‌లో చైనా మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఉద్రిక్త‌త‌ల‌కు భార‌త తీరే కార‌ణ‌మ‌ని చైనా తాజాగా ఆరోపణ‌లు గుప్పించింది. పైపెచ్చు, త‌మ‌ భూభాగాన్నే భార‌త్ ఆక్ర‌మిస్తోంద‌ని అభాండాలు వేస్తోంది.  

చైనా చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తోన్న భార‌త్ ఆ దేశానికి కౌంట‌ర్ ఇచ్చింది. విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... చైనా సైనికుల‌ను మోహ‌రిస్తోంద‌ని తెలిపారు. ఆ దేశ తీరుకు త‌గ్గ‌ట్టుగానే భార‌త సైన్యం కూడా కౌంట‌ర్ చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివ‌రించారు.

తూర్పు ల‌డ‌ఖ్‌లో చైనాతో ఉన్న సరిహ‌ద్దు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇప్ప‌టికైనా చైనా ముందుకు వ‌స్తుంద‌ని భార‌త్ ఆశిస్తోంద‌ని చెప్పారు. కాగా, ఎత్తైన ప్ర‌దేశాల్లో సైనికుల‌ను మోహ‌రించి, మౌలిక స‌దుపాయాల కోసం చైనా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంద‌ని ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి.


More Telugu News