68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటాల సొంతమైన ఎయిరిండియా
- నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాను వదిలించుకున్న కేంద్ర ప్రభుత్వం
- బిడ్ లో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా సన్స్
- ఎయిరిండియాను సొంతం చేసుకోవడానికి పోటీ పడిన స్పైస్ జెట్
హిస్టరీ రిపీట్ అయింది. ప్రభుత్వ విమానయానరంగ సంస్థ ఎయిరిండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఎయిరిండియాను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. రూ. 43 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. తన నిర్ణయానికి అనుగుణంగానే బిడ్డింగ్ నిర్వహించింది. ఎయిరిండియాను సొంతం చేసుకోవడానికి టాటా సన్స్ తో పాటు మరో సంస్థ స్పైస్ జెట్ కూడా బిడ్డింగ్ లో పాల్గొంది. ఈ పోటీలో చివరకు ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుంది.
స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. దీంతో, ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది. 68 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ మరోసారి టాటాల వశమయింది.
మరోవైపు 2020 మార్చి 31 నాటికి ఎయిరిండియాకు దాదాపు రూ. 45,863.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఎయిరిండియాను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ. 20 కోట్ల భారం పడుతోంది. ఇప్పుడు ఆ సంస్థ టాటా సన్స్ సొంతం కావడంలో... నష్టాల నుంచి లాభాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.