హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్‌పై సెహ్వాగ్ కామెంట్స్
- కొన్నిరోజుల క్రితం పాండ్యా వెన్నెముకకు శస్త్రచికిత్స
- అప్పటి నుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్
- టీ20 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సలహా
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యాకు చోటుదక్కింది. కానీ అతను కొంతకాలంగా బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి అతను బౌలింగ్ చేయడం లేదు. ఐపీఎల్ రెండో దశలో కూడా కనీసం ఒక్క ఓవర్ వేయలేదు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ జట్టులో ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం పాండ్యాకు తలకుమించిన భారంలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతజట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా ఒక బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు సేవచేయాలని సెహ్వాగ్ చెప్పాడు. పాండ్యా వంటి ఆటగాడిని తాను వదులుకోనని చెప్పిన అతను.. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా పాండ్యాకు ఉందని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యాను ఒక బ్యాట్స్‌మెన్‌లా చూడాలని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా సూచించారు.