పవన్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడూ అంతే... ఎవరైనా ఏదైనా అంటే కొట్టేవాడు: పోసాని

  • పోసాని ఇంటిపై రాళ్ల దాడి
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోసాని
  • సైకో ఫ్యాన్స్ అంటూ మండిపాటు
  • పవన్ కు ఇగో అంటూ వ్యాఖ్యలు
హైదరాబాదు ఎల్లారెడ్డిగూడలోని పోసాని కృష్ణమురళి నివాసంపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పోసాని స్పందించారు. తనకు నచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోనని స్పష్టం చేశారు. అంతేతప్ప తాను డబ్బుల కోసమో, పదవుల కోసమో మాట్లాడనని వెల్లడించారు. ఇలాంటి రాళ్ల దాడులు ఇంకెన్ని చేసినా తాను భయపడబోనని అన్నారు. తన ఇంటిపై రాళ్లు విసిరింది పవన్ కల్యాణ్ అభిమానులేనని పోసాని ఆరోపించారు.

"పవన్ ఓ ఆవేశపరుడు. తాను మాత్రం ఎవర్నయినా ఏమైనా అనొచ్చు. తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఇతడిది మొదటినుంచి సైకో బుద్ధి. ఆర్టిస్ట్ గా షూటింగుల్లోనూ పవన్ తీరు ఇంతే. ఎవరైనా ఏదైనా అంటే తిట్టడమో, చొక్కా పట్టుకుని కొట్టడమో చాలా చేశాడు. హీరో కాబట్టి ఊరుకునేవారు. సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో ఓ కోడైరెక్టర్ ను పట్టుకుని బూతులు తిట్టాడు. కానీ ఆ కోడైరెక్టర్ ఎలాంటి తప్పు చేయలేదని కొద్దిసేపటికి తెలిసింది. సారీ చెప్పాల్సింది పోయి, ఎంతో ఇగోతో పవన్ దూరంగా వెళ్లి కూర్చుకున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎలా పనికొస్తాడు?

పవన్ ది రెచ్చగొట్టే ధోరణి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా బట్టలిప్పి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. ఇప్పుడు అతడి అభిమానులు కూడా నన్ను బట్టలిప్పి కొట్టాలంటున్నారు. నాకు తెలుగు రాష్ట్రాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఇప్పటివరకు శత్రువులు లేరు. కానీ మొన్న సైకో పవన్ కల్యాణ్ ను ప్రశ్నించాను. సీఎంను ఇలా ఎందుకు అన్నావ్ పవన్ కల్యాణ్? అని అడిగాను. ఓసారి బీజేపీని తిట్టి ఇప్పుడెందుకు పొగుడుతున్నావ్? అని నిలదీశా.

ఇలాంటి దాడులతో నన్ను ఆపలేరు, ఇలాంటి సన్నాసులను, చవటలను చాలామందిని చూశాను. నన్ను బట్టలిప్పి కొడితే నేను కూడా పవన్ కల్యాణ్ ను బట్టలిప్పి కొట్టగలను. నాకెవరూ అక్కర్లేదు... నేనొక్కడినే వెళ్లి పవన్ కల్యాణ్ ను చెప్పుతో కొడతా... మాగ్జిమమ్ ఏంచేస్తారు... చంపుతారు అంతేకదా. ఒక్కడ్ని చంపినంత మాత్రాన ఏపీ ప్రజల్లో మీపై నెలకొన్న చెడు అభిప్రాయం తొలగిపోదు" అని పోసాని నిప్పులు చెరిగారు.


More Telugu News