పిల్లల నోటికాడి కూటిని కూడా లాక్కుంటున్నారు: లంకా దినకర్

  • 'పీఎం  పోషణ్'కు జగనన్న గోరుముద్ద స్టిక్కర్ వేశారు
  • జగన్ సొంత జేబు నుంచి డబ్బులు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు
  • వైసీపీ నేతలు అవినీతిపరుల్లా మారిపోయారు
బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం 'పీఎం పోషణ్'ను మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ నేత లంకా దినకర్ చెప్పారు. పీఎం పోషణ్ పథకాన్ని జగనన్న గోరుముద్దగా స్టిక్కర్ వేసి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందనే విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉన్నతమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంటే... ముఖ్యమంత్రి జగన్ తన సొంత జేబు నుంచి డబ్బులు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంటే... పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. పిల్లల నోటి కాడ కూటిని లాక్కుంటూ వైసీపీ నేతలు అవినీతిపరుల్లా మారిపోయారని చెప్పారు.


More Telugu News