రైలు వేళల్లో మార్పులు.. ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే
- ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ నిర్ణయం
- 872 రైళ్లలో 673 రైళ్ల వేగం పెంపు
- అక్టోబరు 1 నుంచి అమల్లోకి కొత్త మార్పులు
కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా, అలాగే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైళ్ల రాకపోకల వేళలు మారతాయని తెలిపింది.
అదే సమయంలో కొన్ని రైళ్ల మార్గాలను మళ్లించినట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 872 రైళ్లలో 673 రైళ్ల వేగాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రైళ్ల టర్మినల్ స్టేషన్లలో మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.