అనధికారికంగా డీలర్ స్థాయిలో ప్రారంభమైన 'టాటా పంచ్' కార్ల బుకింగులు
- రూ. 5 వేల నుంచి 10 వేల మధ్య టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్
- ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ప్రీ-బుకింగ్స్
- రూ. 5.5 లక్షల నుంచి ధర ప్రారంభమయ్యే అవకాశం
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా నుంచి మరో కారు మార్కెట్లోకి వస్తోంది. మైక్రో ఎస్యూవీ కేటగిరిలో 'టాటా పంచ్' విడుదల కాబోతోంది. ఈ కార్లకు సంబంధించిన అనధికారిక బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాల్లోని షోరూమ్ డీలర్లు ప్రీ-బుకింగ్స్ ను తీసుకుంటున్నారు. రూ. 5 వేల నుంచి 10 వేల మధ్య టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభించారు. అధికారిక బుకింగ్స్ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
కొన్ని వారాల్లోనే టాటా పంచ్ కారు మార్కెట్లోకి వస్తోంది. ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్ఫా-ఏఆర్సీ టెక్నాలజీతో తయారైన తొలి ఎస్యూవీ కారు టాటా పంచ్. గత నెలలోనే ఈ కారుకు సంబంధించిన అధికారిక ఇమేజీలను టాటా సంస్థ విడుదల చేసింది.
టాటా పంచ్ ప్రత్యేకతలు:

- పొడవు - 3,840 మి.మీ. వెడల్పు - 1,800 మి.మీ. ఎత్తు - 1,635 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ - 187 మి.మీ.
- 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 5 స్పీడ్ ఆటొమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి
- మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్స్ మరియు ఆరు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో లభ్యం
- 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్
- రివర్స్ కెమెరా
- క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్
- రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం. మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజిన్. రెండవది 1.2 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజిన్.