పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు: పేర్ని నాని
- పవన్ పిచ్చివాగుడుకి, మాకు సంబంధం లేదని చెప్పడానికే సినీ నిర్మాతలు వచ్చారు
- జనసేన ఒక కిరాయి పార్టీ
- ఆన్ లైన్ టికెటింగ్ కు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంది
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పేర్ని నానిని సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు కలిశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడుకి, తమకు సంబంధం లేదని చెప్పడానికే తన వద్దకు నిర్మాతలు వచ్చారని అన్నారు.
చిరంజీవి ఫోన్ చేసి తనతో మాట్లాడారని పేర్ని నాని తెలిపారు. దురదృష్టవశాత్తు అలా జరిగిందంటూ పవన్ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేశారని చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తమతో మాట్లాడారని తెలిపారు. ఒక వ్యక్తి మాటలపై తామంతా ఏకాభిప్రాయంతో లేమని చెప్పారని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కిరాయికి పని చేసేది ఎవరో అందరికీ తెలుసని... జనసేన ఒక కిరాయి పార్టీ అని విమర్శించారు. రాజకీయ పార్టీని పవన్ కల్యాణ్ ఒక టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆన్ లైన్లో సినిమా టికెట్లను అమ్మే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదని అన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ కు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందని చెప్పారు. సినిమా టికెట్లపై నిర్దిష్టమైన విధానం అవసరమని వ్యాఖ్యానించారు.