అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంయమనం కోల్పోవద్దు: నాదెండ్ల మనోహర్
- సినిమా పరిశ్రమకు న్యాయం చేయాలని పవన్ అడిగారు
- ఇండస్ట్రీని కాపాడమంటే పవన్‌ను కాపాడమని అర్థం కాదు
- పవన్‌పై కావాలనే కొందరు వ్యక్తిగత దాడి చేస్తున్నారు
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు
- ఏపీ ప్రజల సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు వరుసగా చేస్తోన్న విమర్శల పట్ల ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ తో కలిసి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు.
పవన్ కల్యాణ్ సమాజాంలోని ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తారని చెప్పారు. ఆయన కష్టపడి జనసేన పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. సినిమా పరిశ్రమకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ అడిగారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇండస్ట్రీని కాపాడమంటే పవన్‌ను కాపాడమని అర్థం కాదని ఆయన అన్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్‌పై కొందరు వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆయన చెప్పారు. జనసైనికులు, పవన్ అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోవద్దని, దృష్టిని మళ్లించడానికే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన చెప్పారు.
సమాజంలోని పౌరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2019లో వైసీపీ నేతలు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేకమంది జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారని, పార్టీలో చేరుతున్నారని నాదెండ్ల చెప్పారు. వారిని కలుపుకొని జనసేన నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిటీ, యువజన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ఎటువంటి సందర్భంలోనూ రాజీ పడకూడదని నాదెండ్ల చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అంతేగానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని ఆయన అన్నారు.
కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్ కనీసం ఒక్క ఆసుపత్రినైనా సందర్శించారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. జగన్ కంటే ఎక్కువ వయసున్న ఇతర రాష్ట్రాల సీఎంలు ఎందరో ఆయా రాష్ట్రాల్లో ఆసుపత్రులను సందర్శించి కరోనా రోగుల పరిస్థితులను తెలుసుకున్నారని ఆయన చెప్పారు.