'పుష్ప' నుంచి రష్మిక పాత్ర పరిచయం .. పోస్టర్ రిలీజ్!
- షూటింగు దశలో 'పుష్ప' సినిమా
- చివరిదశకు తీసుకొచ్చిన సుకుమార్
- శ్రీవల్లి పాత్రలో కనిపించనున్న రష్మిక
- 'క్రిస్మస్'కి ప్రేక్షకుల ముందుకు
తెలుగులో ఇప్పుడు రష్మిక చేస్తున్న భారీ సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో ఆమె అల్లు అర్జున్ జోడీగా కనిపించనుంది. అడవి ప్రాంతంలోని ఒక గిరిజన గూడెంకు చెందిన యువతిగా ఆమె కనిపించనుందని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకూ పోస్టర్స్ రూపంలో ఆమె లుక్ మాత్రం బయటికి రాలేదు.
ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం, ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'శ్రీవల్లి' అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ, ఆ పాత్రలో ఆమె ఏ లుక్ తో కనిపించనుందనేది చూపించారు. ఈ సినిమాలో ఆమె గూడెంలోనే నివసిస్తుందనే విషయం రష్మిక పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.
చీర .. బొట్టు .. గాజులు .. పూలు .. దగ్గర పెట్టుకుని ఎక్కడికో హడావిడిగా ముస్తాబవుతున్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ పాత్రలో ఆమె కాస్త హాట్ గానే కనిపించనుందనే విషయం కూడా ఈ పోస్టర్ చెప్పేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కి విడుదల చేయనున్నారు. .
ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం, ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'శ్రీవల్లి' అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ, ఆ పాత్రలో ఆమె ఏ లుక్ తో కనిపించనుందనేది చూపించారు. ఈ సినిమాలో ఆమె గూడెంలోనే నివసిస్తుందనే విషయం రష్మిక పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.
చీర .. బొట్టు .. గాజులు .. పూలు .. దగ్గర పెట్టుకుని ఎక్కడికో హడావిడిగా ముస్తాబవుతున్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ పాత్రలో ఆమె కాస్త హాట్ గానే కనిపించనుందనే విషయం కూడా ఈ పోస్టర్ చెప్పేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కి విడుదల చేయనున్నారు.