6 నెలలు పనిచేయించుకుని 50 రూపాయలు ఇచ్చారు: మోహన్ బాబు
- అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను
- అవకాశాల కోసం తిరిగాను
- నాకు భాష తెలియదు అన్నారు
- ఇలా ఎన్నో అవమానాలు
విలన్ గా .. కామెడీ విలన్ గా .. హీరోగా మోహన్ బాబు విశ్వరూపం చూపించారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించి, వీలైనన్ని విజయాలను అందుకున్నారు. అలాంటి మోహన్ బాబు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన కెరియర్ గురించి ముచ్చటించారు.
సినిమాల్లో నటించడానికి ఒక దారి దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. అలా ఆరునెలలు పని చేసిన తరువాత జీతంగా 50 రూపాయలు ఇచ్చారు. అదేమిటని అడిగాను. 'టీ'లు .. టిఫిన్లు .. భోజనాలు .. అన్నీ ఇక్కడే చేస్తున్నావ్ గా' అన్నారు. ఆ మాటకి చాలా బాధకలిగినప్పటికీ, తెలియక అడిగాను అన్నాను.
అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు 'నువ్వు రాయల సీమవాడివి .. నీకు భాష తెలియదు' అన్నారు కొంతమంది. నాకు భాష తెలుసు అని నిరూపించుకోవడం కోసమే సాధన చేశాను .. సక్సెస్ అయ్యాను. ఇలా నా జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను" అని చెప్పుకొచ్చారు.