ఈ ఉపకరణం గుండె జబ్బులను ముందుగానే పసిగడుతుంది.. ఆవిష్కరించిన అపోలో ఆసుపత్రుల చైర్మన్

  • అపోలో, ఏఐ-పవర్డ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ రిస్క్ టూల్ పేరుతో  అభివృద్ధి
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే పరికరం
  • ఇప్పటికే అపోలో ఆసుపత్రులలో వినియోగం
గుండె జబ్బులను ముందుగానే పసిగట్టే ఓ ఉపకరణాన్ని అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నిన్న ఆవిష్కరించారు. ప్రస్తుతం దీనిని అపోలో ఆసుపత్రుల్లో వినియోగిస్తుండగా, ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ పరికరం పనిచేస్తుంది. గుండె జబ్బులను ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని అంచనా వేస్తుంది.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. అపోలో, ఏఐ-పవర్డ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ రిస్క్ టూల్ పేరుతో దీనిని అభివృద్ధి చేసినట్టు చెప్పారు. గుండె జబ్బుల నిర్ధారణలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాగా, ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్, వెబ్‌సైట్ ‘న్యూస్‌వీక్’ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్పెషలైజ్డ్ కార్డియాలజీ, ఆంకాలజీ ఆసుపత్రుల్లో ప్రపంచంలో 250వ ర్యాంకు, పీడియాట్రిక్స్‌లో 150 ర్యాంకు సాధించినట్టు అపోలో హాస్పిటల్స్ నిన్న వెల్లడించింది.


More Telugu News