ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దసరా సెలవుల తర్వాత హైస్కూల్‌లో విలీనం కానున్న 3 నుంచి 5 తరగతులు

  • 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక బడుల్లోని  విద్యార్థుల విలీనం
  • 3,627 ప్రైమరీ స్కూళ్లలోని 3-5 తరగతుల విద్యార్థులు 3,178  హైస్కూళ్లలో విలీనం
  • భవనాల కొరత ఉన్న చోట మాత్రం యథాతథం
దసరా పండుగ తర్వాత ఏపీలోని వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నిజానికి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే దీనిని అమలు చేయాలని అధికారులు భావించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటి వరకు పరిశీలించడంతో సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో  దసరా సెలవుల తర్వాత రాష్ట్రంలోని 3,627 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే, ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉన్న చోట మాత్రం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించాలని  నిర్ణయించారు.


More Telugu News