విజయవాడ పరిధిలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు

  • మళ్లీ రూ. 10 చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • సెప్టెంబరు 30 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి
  • కరోనా కారణంగా పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు
  • తగ్గిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేశాఖ
కరోనా కారణంగా పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను మళ్లీ తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ. 10కి తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌రిజర్వుడ్ రైళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

ప్లాట్‌ఫాం ధరల సమస్యను సాధ్యమైనంత వరకూ తగ్గిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రైళ్లు ఎక్కే సమయంలో సహాయంగా ఉండే వారికి ఈ తగ్గింపు బాగా ఉపయోగపడుతుందని వెల్లడించింది. అయితే కరోనా మహమ్మారితో పోరులో రైల్వేశాఖ చేపడుతున్న జాగ్రత్తలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


More Telugu News