కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ను తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తముంది: హరిరామజోగయ్య

  • పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రుల ధ్వజం
  • కాపు మంత్రుల వ్యాఖ్యలను ఖండించిన హరిరామజోగయ్య
  • ఇది కాపు సమాజాన్ని అవమానించడమేనని వ్యాఖ్యలు
  • 2024లో పర్యవసానాలు ఎదుర్కొంటారని హెచ్చరిక
సీనియర్ రాజకీయవేత్త, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ క్యాబినెట్ లోని కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను అవమానపర్చడం అంటే కాపు సమాజాన్ని అవమానపర్చడమేనని హరిరామజోగయ్య పేర్కొన్నారు. ఇలాంటి నీచ చర్యల పర్యవసానం ఏంటో 2024లో ఎన్నికల్లో ముఖ్యమంత్రికి తెలిసివస్తుందని హెచ్చరించారు.


More Telugu News