తెలంగాణలో మరో 220 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 44,200 కరోనా టెస్టులు
- కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తాజాగా 255 మందికి కరోనా నయం
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,549 మందికి చికిత్స
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,200 కరోనా పరీక్షలు చేపట్టగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 255 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,504కి చేరింది. 6,57,040 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,549 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,915కి పెరిగింది.