కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

  • పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టుపై అభ్యంతరం
  • ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సబ్ కమిటీ సమావేశం
  • తుపాను కారణంగా వాయిదాపడిన మీటింగ్ 
ఏపీ సర్కారు పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. పిన్నపురం ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్ బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు. ప్రస్తుత ప్రాజెక్టులు, నూతనంగా చేపడుతున్న ప్రాజెక్టుల పనులు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ప్రస్తావించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సబ్ కమిటీ సమావేశం గులాబ్ తుపాను ప్రభావం కారణంగా వాయిదా పడింది. అక్టోబరు 14 నుంచి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రానున్నాయి. దీనికి సంబంధించి నేటి సమావేశంలో చర్చించాలని భావించారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ సమావేశం నిర్వహించడం సాధ్యం కాలేదు.


More Telugu News