యస్ బ్యాంక్ కుంభకోణం.. రాణాకపూర్ భార్య, కూతుళ్లకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు

  • రూ. 4 వేల కోట్ల నష్టం కలిగించినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు
  • బెయిల్ నిరాకరించిన సీబీఐ స్పెషల్ కోర్టు
  • బాంబే హైకోర్టులో సవాల్ చేసిన రాణా కపూర్ భార్య, కూతుళ్లు
యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ భార్య బిందు, ఇద్దరు కూతుళ్లు రోషిణి, రాధలకు బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. ప్రైవేట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో కలిసి మోసపూరిత, అవినీతి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. యస్ బ్యాంక్ కు వీరు రూ. 4 వేల కోట్ల నష్టం కలిగించినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీరికి బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ నెల 18న ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఆదేశాలను వీరు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం వీరు ముంబైలోని బైకుల్లా మహిళా జైల్లో ఉన్నారు.


More Telugu News