ర్యాలీగా బయలుదేరనున్న మంచు విష్ణు
- 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీ
- నామినేషన్లు వేయడానికి వెళ్లనున్న విష్ణు ప్యానెల్ సభ్యులు
- మొదట ఫిల్మ్ చాంబర్‌లో దాసరికి నివాళులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ప్రకాశ్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ రోజు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నేడు ఆయన తన ప్యానెల్‌లో జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తోన్న రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీపడుతున్న బాబూమోహన్, వైస్ ప్రెసిడెంట్లుగా నిలబడుతున్న మాదాల రవి, పృథ్వీరాజ్ తదితరులను కలిశారు.
ఇక వారందరితో కలిసి సరిగ్గా మధ్యాహ్నం 1.09కు నామినేషన్ వేయాలని నిర్ణయించారు. అలాగే వారితో కలిసి ర్యాలీగా కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ఫిల్మ్ చాంబర్‌లో దాసరి నారాయణ రావుకు ఆయన నివాళులర్పించనున్నారు. కాగా అక్టోబరు 10న 'మా' ఎన్నికలు జరగనున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ 'మా'అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు.