క‌రోనా వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసు వేయించుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

  • ఇటీవ‌లే బూస్ట‌ర్ డోసుకు అమెరికా ఆమోదం
  • 65 ఏళ్లు పైబడిన వారు వేయించుకోవాల‌ని పిలుపు
  • శ్వేత‌సౌధంలో ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోసు తీసుకున్న బైడెన్
క‌రోనా వ్యాక్సిన్లు వేయించుకున్నప్ప‌టికీ కొంద‌రికి కొవిడ్ సోకుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోసుపై ప‌లు దేశాలు దృష్టి సారిస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూస్టర్ డోసు వేయించుకున్నారు. అధ్యక్ష భవనం శ్వేత‌సౌధంలో ఆయన ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోసు తీసుకున్నారు.

కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన అమెరికా ఎన్నిక‌ల్లో బైడెన్ గెలుపొంద‌క‌ముందే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అంద‌రూ వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న అప్ప‌ట్లో ప్రోత్స‌హించారు. రెండు డోసులు తీసుకున్న అనంత‌రం ఆయ‌న‌కు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ రాలేద‌ని శ్వేత‌సౌధం అధికారులు చెప్పారు.

ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోసు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవ‌లే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం ఫైజర్ బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు తీసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. దీంతో అర్హత ఉన్నవారు బూస్ట‌ర్ డోసు వేయించుకోవాల‌ని బైడెన్ పిలుపునిచ్చారు.


More Telugu News