పవన్ నాయుడు, మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం... చౌదరి గారూ మధ్యలో మీరెందుకు దూరిపోతారు?: పేర్ని నాని
- పేర్ని నాని ప్రెస్ మీట్
- పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
- ఏరా, ఒరే అంటూ ఏకవచన సంబోధన
- పవన్ మావాడే అంటూ వ్యంగ్యం
- ఓవైపు విమర్శలు, మరోవైపు సెటైర్లతో విరుచుకుపడిన నాని
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా, ఓ రిపోర్టర్ అందుకుని మిమ్మల్ని పవన్ కల్యాణ్ సన్నాసి అన్నాడు కదా అని ప్రశ్నించారు. దానికి పేర్ని నాని బదులిస్తూ... పవన్ నాయుడు నన్ను సన్నాసి అన్నాడా? అయినా మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం, సన్నాసి, దద్దమ్మ అనుకుంటాం, అరే ఓరే అనుకుంటాం, వాడు వీడు అనుకుంటాం అందులో తప్పేమీ లేదులే చౌదరి గారూ, మధ్యలో మీరెందుకు దూరతారు అంటూ సదరు రిపోర్టర్ కు స్పష్టం చేశారు.
"నేను కాపునే. నేను సన్నాసిని అయితే పవన్ కల్యాణ్ గాడు కూడా సన్నాసే అవుతాడు కదా. వాడు పవన్ కల్యాణ్ గాడు సన్నాసిన్నర సన్నాసి. మావాడు తెగ మాట్లాడుతున్నాడు. చుట్టాలం కాబట్టి ఇక దాయడం ఎందుకు" అంటూ పవన్ ను ఏకవచన సంబోధనతో పేర్ని నాని తూర్పారబట్టారు.
"వాడు, మేం అంతా ఒకటే, అంతా ఆ తానులో ముక్కలం. ఇవాళ సాయితేజ్ యాక్సిడెంట్ గురించి కూడా మా వెధవన్నర వెధవ మాట్లాడాడు. మీడియాదే తప్పు అని మాట్లాడాడు. మీడియాకు బుద్ధి ఉందా అని అడిగాడు. ధైర్యం ఉందా అని మీడియాను కూడా అడిగాడు. మీడియాను కూడా సన్నాసుల్లారా అన్నాడు.
సాయితేజ్ కు యాక్సిడెంట్ రోజున అసలేం జరిగింది, మీడియా ఏంచెప్పింది? ఈ ఘటనలో అసలు గుండెకాయ లేనిది ఎవరికి మీడియాకా, మా పీకే గాడికా? తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో నాడు మీడియా కూడా అదే చెప్పింది. దీంట్లో ఎవర్ని తప్పుబట్టాలి? నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ విషయంలో తెలంగాణ పోలీసులను తిట్టాలి, లేకపోతే సీఎం కేసీఆర్ ను తిట్టాలి. ఏమైపోయాయి నీ దమ్ము, ధైర్యం. అవేవీ నీలో లేవా? లోపలికి వెళ్లిపోయాయా? సీఎం జగన్ మాత్రం నీకు లోకువ అయ్యాడా?
కేసీఆర్ ను సన్నాసి, వెధవ, లుచ్ఛా అని తిట్టలేవా? కేసీఆర్ ను తిట్టాలంటే గజగజ వణికిపోతాడని, ప్యాంట్లో కారిపోతాయని అందరికీ తెలుసు. తెరమీద అయితే ఎన్ని డైలాగులు చెప్పినా ఎవరూ ఎదురు పలకరు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ వైఎస్సార్ కాంగ్రెస్ అంటున్నావు... కానీ ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. కాబట్టే నువ్వు ఏది పిచ్చవాగుడు వాగినా చెలామణీ అవుతోంది.
నాన్నా పీకే.. నా మాటలు నువ్వు వింటున్నావని నాకు తెలుసు. ఎందుకంటే నాకు పెద్ద ఫ్యాన్ వని నాకు తెలుసు. నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటువి నువ్వు. వకీల్ సాబ్ సినిమాను ఆపేసుకుని మరీ బందరు వచ్చి నన్ను తిట్టావు. నీ మనసంతా నేను ఉన్నట్టుంది. ఏరా పీకే... శుంఠన్నర శుంఠా... ఏ పాపం తెలియని మీడియాను తప్పుబడతావా? నీకు ఖలేజా ఉంటే తెలంగాణ పోలీసులనో, కేసీఆర్ నో తిట్టుకో.
సాయితేజ్ మంచి కుర్రాడు, త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ సహా మేమందరం ఆకాంక్షిస్తున్నాం. సీఎం జగన్ కోడికత్తి కేసు ఏమైందో రాసుకోండ్రా అంటూ మీడియాకు చెబుతున్నారు. అరే బాబూ... కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోంది. నీకు ఒంట్లో ఏమైనా ఉంటే వెళ్లి అమిత్ షాను అడుగు. కోడికత్తి కేసు ఏమైందో ఆయన చెబుతారు. అక్కడ అడిగే దమ్ములేదు కానీ, ఇక్కడ మాత్రం సినిమా చూపిస్తున్నారు. నీ మాటలకు ఏంచెప్పాల్రా... మావాడు పిరికి సన్నాసి అని చెప్పమంటావా?" అంటూ నిప్పులు చెరిగారు.