టీ20 జట్టు మెంటార్‌గా ధోనీ నియామకంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్పందన
- అద్భుతమైన టీ20 కెప్టెన్ ధోనీ అంటూ కితాబు
- అలాంటి బుర్ర అవసరం చాలా ఉంటుందని వ్యాఖ్య
- భారత టీ20 జట్టు తీసుకున్న అతిగొప్ప నిర్ణయం అంటూ మెచ్చుకోలు
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుతోపాటు టీమ్ మెంటార్‌గా ధోనీని నియమిస్తున్నట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ నియామకంపై ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ స్పందించాడు.
ధోనీ అత్యద్భుతమైన టీ20 కెప్టెన్ అని అతను కొనియాడాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టుకు ధోనీని మెంటార్‌గా నియమించడం టీమిండియా తీసుకున్న అతిగొప్ప నిర్ణయమని మెచ్చుకున్నాడు. అతను చేసే పనిలో ధోనీ చాలా సహజంగా ఉంటాడని కొనియాడిన వాగన్.. ‘‘ధోనీ వంటి బుర్ర అవసరం చాలా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
కాగా, ధోనీ నియామకం చెల్లదంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఒక వ్యక్తి బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే కారణంతోనే అతన్ని మెంటార్‌గా నియమించినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.