తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
- ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హెచ్చరిక
- ఉత్తరాంధ్రపై తీవ్రప్రభావం చూపనున్న గులాబ్ తుఫాను
- కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న తుఫాను
‘గులాబ్’ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి తాజా ప్రకటన వెలువడింది. గులాబ్ తుఫాను వల్ల పశ్చిమ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది.
ఈ క్రమంలో తొలుత ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ దాన్ని ఇప్పుడు రెడ్ అలర్ట్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు ఆర్కే జెనమణి వివరించారు.
ఈ తుఫాను పశ్చిమం వైపుగా ప్రయాణిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుఫాను కారణంగా రెండు రాష్ట్రాల్లో పలు రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.