హైద‌రాబాద్‌లో డ్రైనేజీ గుంతలో ప‌డ్డ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ కోసం 15 గంట‌లుగా గాలింపు.. గుంత‌లో అత‌డు ప‌డిన వీడియో ఇదిగో

  • నిన్న రాత్రి మ‌ణికొండ‌లో ఘ‌ట‌న‌
  • గాలిస్తోన్న రెండు బృందాలు
  • షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ప‌నిచేస్తోన్న బాధితుడు
హైదరాబాద్ నిన్న రాత్రి కురిసిన వ‌ర్షాల‌కు.. మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ప‌డి ఓ వ్య‌క్తి గ‌ల్లంతు అయ్యాడు. అత‌డి పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.

నిన్న రాత్రి 9 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా, నిన్న రాత్రి  ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.




More Telugu News