రోడ్డుపై పిల్లలు షికార్లు కొట్టేందుకు ‘యూనికార్న్’ రోబోలు

  • తయారు చేస్తున్న చైనా కంపెనీ ‘జిపెంగ్’
  • రోబో ఎలక్ట్రిక్ గుర్రాలను విడుదల చేసేందుకు ప్రయత్నం
  • ఏఐతో నడిచే వీటిపై రోడ్లపై కూడా తిరిగేయొచ్చు
ప్రపంచ వ్యాప్తంగా పలు పురాణ కథల్లో వినిపించే జంతువు పేరు ‘యూనికార్న్’. ఈ ఒంటి కొమ్ము గుర్రాలు గాల్లో ఎగిరేస్తాయని, రెక్కలు విప్పి ఎక్కడికైనా క్షణాల్లో చేరుకుంటాయని చెబుతారు. అలాంటి యూనికార్న్ అంటే పిల్లలకు భలే ఇష్టం.

ఇదిగో ఈ ఇష్టాన్నే క్యాష్ చేసుకోవాలని చైనాకు చెందిన ఒక కంపెనీ భావిస్తోంది. ఇది త్వరలోనే పిల్లలను ఎక్కించుకొని తిరగగలిగే యూనికార్న్ బొమ్మలను ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో తయారు చేసేందుకు ‘జిపెంగ్’ అనే కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన బ్లూప్రింట్లు ఇప్పటికే తయారు చేసిన సదరు సంస్థ ఈ రోబో యూనికార్న్ టెస్టు ట్రయల్స్ వేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ జిపెంగ్ కంపెనీ తయారు చేసే రోబోకు ఒక కొమ్ము కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనిపై ఎక్కిన చిన్నారులు రోడ్డుపై ఎంచక్కా చక్కర్లు కొట్టేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతానికి ల్యాబులో ఉన్న ఈ రోబో యూనికార్న్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది.


More Telugu News