కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!

కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!
  • గత లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్నయ్య
  • బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓటమి
  • గుజరాత్‌లోని వడ్‌గాం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్ మేవాని
బీహార్‌కు చెందిన యువ నేత కన్నయ్య కుమార్, గుజరాత్‌కు చెందిన జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌లో చేరేందుకు  ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న వీరిద్దరూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నయ్య కుమార్ గత లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరి బీహార్‌లోని బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గుజరాత్‌లోని వడ్‌గాం ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మేవాని రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్‌గా ఉన్నారు. భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News