రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

  • 33 పరుగుల తేడాతో నెగ్గిన ఢిల్లీ
  • 155 పరుగుల లక్ష్యఛేదనలో 121 రన్స్ చేసిన రాజస్థాన్
  • కెప్టెన్ సంజూ శాంసన్ ఒంటరిపోరాటం
  • 70 పరుగులతో నాటౌట్ గా నిలిచిన శాంసన్
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 33 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. 53 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 1 సిక్స్, 8 ఫోర్లు కొట్టాడు.

అయితే, శాంసన్ కు మరో ఎండ్ లో సహకారం అందించే వాళ్లు కరవయ్యారు. మహిపాల్ లోమ్రోర్ 19 పరుగులు చేశాడు. మరే బ్యాట్స్ మన్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2, ఆవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1, రబాడా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ లో నేడు రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. షార్జాలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఎంతో చిన్నదైన ఈ స్టేడియంలో చేజింగ్ చేయడమే మేలని సన్ రైజర్స్ భావిస్తోంది. హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. పంజాబ్ కింగ్స్ జట్టులో ఫాబియన్ అలెన్, పోరెల్, అదిల్ రషీద్ లను పక్కనబెట్టారు. వారిస్థానంలో క్రిస్ గేల్, రవి బిష్ణోయ్, ఎల్లిస్ జట్టులోకి వచ్చారు.


More Telugu News