అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు... రికార్డు చేసిన నాసా ఇన్ సైట్ ల్యాండర్
- సెప్టెంబరు 18న ప్రకంపనలు
- దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగిన వైనం
- 700 ప్రకంపనలు గుర్తించిన ఇన్ సైట్ ల్యాండర్
- అంగారకుడి ఉపరితలం పలుచన అంటున్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై చాన్నాళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది. ఈ క్రమంలో నాసాకు చెందిన ఇన్ సైట్ ల్యాండర్ ఆసక్తికర అంశాన్ని భూమికి చేరవేసింది. అంగారక గ్రహం ఉపరితలంపై వచ్చిన భారీ ప్రకంపనలను ఇన్ సైట్ ల్యాండర్ నమోదు చేసింది. వీటి తీవ్రతను 4.2గా గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో అంగారకుడి ఉపరితలంపై మూడు పర్యాయాలు ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడైంది.
భూమి ఉపరితలం కంటే అంగారకుడి ఉపరితలం చాలా పలుచన అని నాసా భావిస్తోంది. అందుకే అంగారకుడిపై ఏర్పడుతున్న ప్రకంపనలు అత్యధిక సమయం పాటు కొనసాగుతున్నాయని పేర్కొంది. సెప్టెంబరు 18న సంభవించిన ప్రకంపనలు దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగినట్టు తెలిపింది. ఇప్పటివరకు అంగారకుడిపై వచ్చిన 700 ప్రకంపనలను ఇన్ సైట్ ల్యాండర్ నమోదు చేసింది.