దీపావళికి 'రొమాంటిక్' రిలీజ్!

  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ  
  • నవంబర్ 4వ తేదీన విడుదల     
ఆకాశ్ పూరి కథానాయకుడిగా అనిల్ పాదూరి దర్శకత్వంలో 'రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఆయనే కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అందించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ద్వారా, తెలుగు తెరకి కథానాయికగా కేతిక శర్మ పరిచయమవుతోంది.

ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలాకాలమే అయింది. అయితే కరోనా కారణంగా వెయిట్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.

సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆకాశ్ పూరి ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి..


More Telugu News