టీ20 ప్రపంచకప్ కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
- తొలి రౌండ్ మ్యాచ్ లకు కన్సల్టెంట్ గా జయవర్ధనే నియామకం
- అండర్19 ప్రపంచకప్ కు మెంటార్, కన్సల్టెంట్ గా జయవర్ధనే
- ఐపీఎల్ లో ముంబై జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న జయవర్ధనే
వచ్చే నెలలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ మహేల జయవర్ధనేను వరల్డ్ కప్ తొలి రౌండ్ మ్యాచ్ లకు కన్సల్టెంట్ గా నియమించింది. దీంతో పాటు వచ్చే ఏడాది వెస్టిండీస్ లో జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం ఆయనను కన్సల్టెంట్ గా, మెంటార్ గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ లో తొలి రౌండ్లో ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియాలతో శ్రీలంక ఆడుతుంది. ఈ రౌండ్ గెలిచే మ్యాచ్ లను బట్టి సూపర్ 12కు అర్హత సాధిస్తుంది.
మరోవైపు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు జయవర్ధనే 2017 నుంచి హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆ జట్టుకు ఇప్పటి వరకు మూడు సార్లు టైటిల్ అందించాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జయవర్దనే శ్రీలంక జట్టు బయోబబుల్ లో చేరతాడు.