ఈ సంక్షేమ పథకాలు ఇంకే రాష్ట్రంలో అయినా చూపించగలరా అని సవాల్ చేశా: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
- తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- విపక్ష సభ్యులపై స్పీకర్ అసంతృప్తి
- మైక్ పట్టుకుంటే తిట్టడమే పని అంటూ వ్యాఖ్యలు
- తెలంగాణ పథకాలు మరే రాష్ట్రంలో లేవని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విపక్ష సభ్యుల తీరుపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మైక్ పట్టుకుని కొందరు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ గమనించాలని హితవు పలికారు.
తెలంగాణలో మాత్రమే రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి పథకాలు ఇంకే రాష్ట్రంలో అయినా చూపించగలరా? అని సవాల్ విసిరానని పోచారం వెల్లడించారు. 'తెలంగాణలో మేం 10 ఇస్తున్నాం, మీరు 11 ఇచ్చినప్పుడు మాట్లాడండి' అంటూ విపక్ష నేతలకు హితవు పలికారు.