ఆ కాలేజీల లెక్చరర్లకు రఘురాజుకు ఇచ్చినట్టు కౌన్సిలింగ్ ఇస్తున్నారు: అశోక్ బాబు
- ఏపీలో విద్య, వైద్య వ్యవస్థలు నాశనమవుతున్నాయి
- ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది
- రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు
ఏపీలో వైద్య విధాన పరిషత్, విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయని చెప్పారు. ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజుకు ఇచ్చినట్టు కౌన్సిలింగ్ ఇవ్వడం దారుణమని అన్నారు.
ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని అశోక్ బాబు దుయ్యబట్టారు. విద్యా విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉంటుందని.. కావున ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు.