వరంగల్ జిల్లాలోని న‌ర్సంపేట‌ బిట్స్ కాలేజీలో క‌ల‌క‌లం.. విద్యార్థిని చంపేసిన తోటి విద్యార్థులు

వరంగల్ జిల్లాలోని న‌ర్సంపేట‌ బిట్స్ కాలేజీలో క‌ల‌క‌లం.. విద్యార్థిని చంపేసిన తోటి విద్యార్థులు
  • గ‌త  అర్ధ‌రాత్రి విద్యార్థుల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ‌
  • సంజ‌య్ అనే విద్యార్థిని భ‌వ‌నం పైనుంచి తోసేసిన వైనం
  • ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు 
వరంగల్ జిల్లాలోని న‌ర్సంపేట‌ బిట్స్ కాలేజీలో గ‌త అర్ధ‌రాత్రి విద్యార్థులు ఘ‌ర్ష‌ణ‌కు దిగి క‌ల‌క‌లం రేపారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతుడి పేరు సంజ‌య్‌గా గుర్తించారు. సంజయ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి అని చెప్పారు. సంజ‌య్‌ మృతిపై అత‌డి తల్లిదండ్రులకు స‌మాచారం అందించారు.

గ‌త అర్ధ‌రాత్రి నలుగురు విద్యార్థుల మధ్య చిన్న వివాదం చెల‌రేగింది. అది పెరిగి వారు ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహంతో సంజ‌య్‌ను ఇత‌ర‌ విద్యార్థులు కాలేజీ భ‌వ‌నం నుంచి కింద‌కు తోసేశారు. అనంత‌రం సంజయ్‎ను ఆసుప‌త్రికి తరలించారు. అయితే, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడని వైద్యులు ప్ర‌క‌టించారు.


More Telugu News