ఆర్సీబీ దూకుడుకు అడ్డుకట్ట వేసిన చెన్నై బౌలర్లు

  • షార్జాలో చెన్నై వర్సెస్ బెంగళూరు
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్
  • అర్ధసెంచరీలు సాధించిన పడిక్కల్, కోహ్లీ
  • శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేని వైనం
షార్జాలో ఇసుక దుమారం శాంతించిన తర్వాత కోహ్లీ (53), పడిక్కల్ (70) జోడీ తుపాను వేగంతో చెలరేగడంతో చెన్నైతో బెంగళూరు మ్యాచ్ లో అతి భారీ స్కోరు నమోదవుతుందని అందరూ భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. తొలి వికెట్ కు 13.2 ఓవర్లలో 111 పరుగులు జోడించిన బెంగళూరు జట్టు... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలో కోహ్లీ, పడిక్కల్ ల విజృంభణను చవిచూసిన చెన్నై బౌలర్లు... చివర్లో అద్భుతంగా కట్టడి చేశారు.

కోహ్లీ, పడిక్కల్ అవుటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ అదే ఊపు కొనసాగించలేకపోయారు. డివిలియర్స్ 12, మ్యాక్స్ వెల్ 11, టిమ్ డేవిడ్ 1, హర్షల్ పటేల్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో డ్వేన్ బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ ఓ వికెట్ తీశారు. రవీంద్ర జడేజా వికెట్లు తీయకపోయినా, బెంగళూరు పరుగుల ప్రవాహాన్ని నిలువరించాడు.


More Telugu News