కోర్టు సీనులో మందుకొడుతూ కనిపించిన ఆర్టిస్టులు.. టీవీ కామెడీ షోపై పోలీసు కేసు!
- హిందీలో పాప్యులర్ కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’
- ఒక ఎపిసోడ్‌లో కోర్టు సెట్‌లోనే మందుకొట్టిన నటులు
- తప్పుబడుతూ మధ్యప్రదేశ్‌లో కేసు వేసిన లాయర్
హిందీలో చాలా పాప్యులర్ అయిన టీవీ కార్యక్రమాల్లో ‘ది కపిల్ శర్మ షో’ ఒకటి. ఇది ఎంత పెద్ద హిట్ అంటే బాలీవుడ్ ఖాన్‌ల నుంచి హీరోలంతా తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోలో పాల్గొంటారు. అలాంటి ఈ కార్యక్రమంపై ఒక లాయర్ కేసు వేశాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన ఈ లాయర్ ‘ది కపిల్ శర్మ షో’ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇటీవల ప్రదర్శించిన ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారని, దానిలో నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారని ఆ లాయర్ చెప్పారు. ఇది కోర్టును అగౌరవపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసినట్లు సదరు లాయర్ చెప్పారు.
‘‘సోనీ టీవీలో వస్తున్న కపిల్ శర్మ షో చాలా అసంబద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో మహిళలపై చాలా అసభ్య కామెంట్లు చేస్తారు. ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారు. ఆ సెట్‌లో కొందరు నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారు. ఇది కోర్టును అగౌరవపరచడమే. అందుకే సెక్షన్ 356/3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాను. ఇలాంటి అసంబద్ధతను కచ్చితంగా ఆపాల్సిందే’’ అని పిటిషన్ వేసిన న్యాయవాది చెప్పినట్లు సమాచారం.