సిల్క్ స్మిత వర్ధంతి సందర్భంగా సీనియర్ నటి రాధ స్పందన

  • సెప్టెంబరు 23న స్మిత వర్ధంతి
  • స్మితను స్మరించుకున్న రాధ
  • క్యారెక్టర్ రోల్స్ ను కూడా పండించేదని కితాబు
  • ఆమెకు మేకప్ తో పనిలేదని వెల్లడి
ఐటమ్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కొద్దిమంది తారల్లో సిల్క్ స్మిత ఒకరు. తన అందచందాలతోనే కాకుండా, పలు చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతోనూ ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అయితే విషాదకర పరిస్థితుల్లో స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబరు 23 ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్ రాధ తన సమకాలికురాలు స్మితను స్మరించుకున్నారు.

"నా తొలి చిత్రంలో సిల్క్ స్మిత నా వదిన పాత్ర పోషించింది. స్మిత కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, భావోద్వేగాలు పండించే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తుందని నాకప్పుడే అర్థమైంది. ఆమె ఎలాంటి మేకప్ లేకుండానే చీరకట్టులో ఎంతో అందంగా కనిపించేది. అంతేకాదు, హృదయానికి హత్తుకునే పాత్రల్లో నటించే సమయంలో ఆమెకు మేకప్ అవసరం ఉండేది కాదు. అంత గొప్ప నటి చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడడం ఎంతో బాధాకరం" అని రాధ ట్విట్టర్ లో పేర్కొన్నారు.


More Telugu News